Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

17, డిసెంబర్ 2014, బుధవారం

నమ్మకమే జీవితం

[శశిధర్ పింగళి]

ప్రేమగా నాటిన విత్తు
మొలకెత్తి -మొక్కై
ఆకులు తొడుగుతున్నప్పుడు
మొగ్గలు పువ్వులై  తోటంతా
ఆక్రమించుకున్నప్పుడు
గుండె గదంతా పూర్తిగా
పరుచుకున్న - ఆనందం

ప్రేమగా పెంచుకున్న
పూ దోటని  ఓ
తోటమాలి  నాదంటూ
తీసుకుపోతున్నప్పుడు కూడా

కళ్ళల్లో 
సెలయేళ్ళు వురుకుతున్నాయి – కానీ
గుండేల్లో మాత్రం
అదే ఆనందం
బహుశాః
నే పెంచిన తోటకు
నాకంటే  అదంగా
పరిమళాలద్దుతాడన్న
నమ్మకమే కావొచ్చు!
నమ్మకమేగా జీవితం!
------- 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

"బహుశః నే పెంచిన తోటకు .. నాకంటే అందంగా పరిమళాలద్దుతాడన్న నమ్మకమే కావచ్చు... " నిజమే అందరూ అదే నమ్మకంతోనే పంపుతారు.. బాగుంది.