(పింగళి మోహిని)
సీ|| వెలియైన విలువైన వేదాది విద్యల
మనకంద జేసిన మత్స్యరూపి
అమరత్వలబ్ధికి నాదారభూతమై
కూర్మి వెన్నందించు కూర్మరూపి
అసుర గుణావిష్టయైనట్టి పుడమిని
రక్షించు నాదివరాహమూర్తి
దుష్టశిక్షణ కేళి శిష్టరక్షణ కళా
శీలతత్పరుడు నృసింహమూర్తి
దివ్యకార్యార్థమై త్రిపదాల బలిమితో
బ్రహ్మాండమలమిన వామనుండు
పరశువు జేబూని ప్రబలక్షత్రియ గర్వ
భంగమ్ము గావించు భార్గవుండు
ఆశ్రితావనదీక్ష యాదర్శవర్తనల్
ధర్మవిగ్రహుడు కోదండపాణి
అఖిల నిగమ సారమగు గీత బొధించు
ఆచార్యవరుడైన యదువిభుండు
తే.గీ|| ధర్మహితబొధ చేయు సిద్దార్థమౌని
లీలనవతార కళలన్ని మేళవించి
ధర్మసంస్థాపనార్థమై ధరకు దిగిన
పదవయవతారుడే! సాయి ప్రభువరుండు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి