Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

12, డిసెంబర్ 2014, శుక్రవారం

దినచర్య

[ శశిధర్ పింగళి ] 
ఆకాశద్వారాన్ని - ఆశా కుసుమాలతో
అందంగా అలంకరిస్తున్నారు..
లేలేత పాదాలతో నడిచి వచ్చే
ఆ వెలుగుల రాయనికి
సముద్రజలాల తో అభిషేకించి స్వాగతం
పలుకుతున్నారు ..
అతని రాకతో పులకరించి
సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కిన
సంధ్యా సుందరి - నుదుట
సింధూరం దిద్దుకుంటోంది
జగాన్ని జయించినా
క్షుత్తును జయించలేని
మనిషి - జానెడు పొట్ట జేతపట్టుకుని
బ్రతుకు పోరాటానికి-బాహాటంగానే
బయలుదేరుతున్నాడు
పొద్దువాటారిన మలిసంధ్యలొ
సాయంకాలపు చల్లగాలులు
మోసుకొచ్చె పరీమళాల మత్తులొ
అనుభవాలను అల్లుకుంటూ
ఙ్ఞపకాలను నెమరువెసుకుంటూ
పరుచుకుంటున్న చీకటి కి
పక్కలు పరుస్తూ - రేపటి వెలుగు కోసం
వాకిటిలొ ముగ్గులు సిద్ధం చేసుకుంటున్నారు..
ఆశల వలయంలో ఆనందక్షణాలని
వడిసిపట్టి ఙ్ఞాపకాల పేటికలొ
భద్రపరుస్తూ .. రేపటి
పోరాటానికి బలాల్ని సిద్దంచేసుకుంటున్నారు.


కామెంట్‌లు లేవు: