[ శశిధర్ పింగళి ]
యే మత్తుందోగానీ - మరి
****
నేజూచిన కన్నులు నాలో -
కలిగించెను కమ్మని భావనలేవో
అనిపించెను నాలో నాకే -
అవి కన్నులు కావేమో?
వికసించిన ..
నల్లని కలువల జంటేమో! నని
ఆ..... నల్లని కాటుక కన్నులలోయే మత్తుందోగానీ - మరి
రావే నాచూపులు విడివడి -
బుద్ధేమో తప్పని చెబితే
మనససలా మాటే వినదే!
పైగా -
ఎదురడిగెను నన్నే-
అసలా కన్నులు చూడని కనులెందుకని?
ఇది నిజమా? యని నీవనవచ్చును
నీ వెరుగవు -
నే పలుకునదంతా ప్రత్యక్షర సత్యంబని
ఇంతవినీ నీ వడిగెదవేమో!
ఆ కన్నులలో యే ముందని?
ఆ కనులు .. కాదు - కాదు
నా పాలిట వలపు గనులు
ఆ కన్నులలో ...
చిరువెన్నెల చల్లదనం వుంది
మరుమల్లెల కమ్మదనం వుంది
చేమంతుల చిలిపిదనం వుంది
ఆ చూపులలో ...
మనసెరుగని తీయదనం వుంది
నే కోరిన సర్వస్వం - వుంది
అంతెందుకు... నా
బ్రతుకంతా ఆ కన్నులనే
చూడాలని వుంది
చూస్తూనే - కాలం
గడిపేయాలని వుంది.
7 కామెంట్లు:
"కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమీ.."
మీ కవితకు అర్ధం ఇది కాకపోయినా కవిత చదవగానే ఈ పాట గుర్తొచ్చింది. అందమైన కవితలు వ్రాస్తారు, కొంచెం తరచూ వ్రాస్తుండండీ..
జ్యోతిర్మయి గారికి ధన్యవాదాలు.
good.keep it up
Thnaks & Welcome to my blog Sarmaji
chala chala bagundi
Siva
chala chala bagundi
Siva
Dhanyosmi!
కామెంట్‌ను పోస్ట్ చేయండి