[ శశిధర్ ఫింగళి ]
నాశాంత తనుకాంతి ఆశాంతమై తోచు
నా కాంత కను కాంతి చంద్రకాంతిని త్రోచు
నా రాణి పాదాల పారాణి వెలుగులే
ప్రాగ్భాగమరుణిమై ప్రభలు చిందు
నా బాల ఫాల మర్ధచంద్రుని బోలు
ఆ నీలి కురులలో నెరితుమ్మెదలు వ్రాలు
నా కలికి గొంతులో కులుకు కోయిల కూన
ఆ కులుకు పలుకులో కురియు తేనెలవాన
నా రాగ సుందరీ నాట్యమాడెడివేళ
అచ్చంపు రాయంచలడుగులొత్తు
నా వాణి వేణిలో విరియు మల్లెల సౌరు
సొక్కి విహరించు నా యెడద యెక్కి వెన్నెల తేరు
నా లేమ వనసీమ నడయాడు సమయాన
పసిడి పచ్చని చేలు పాటపాడు
నా చాన చనువార చెయిసాచి పిలువంగ
సింహ, శార్దూలముల్ చెలిమి చేయు
నా సఖియ వెలయించు సౌహార్ద్రతను చూచి
సూర్యుడంతటి వాడు సుధలు కురియు
నా తరుణి గుణగణాల్ నా తరమె వర్ణింప
దాన సరితూగు చానలీ లోకాన లేరన్న
అతిశయోక్తులు కావులే అతివలార -
ఏ పూర్వ పుణ్యమో - ఏ పుణ్యఫలితమో
అతివ రూపాన నాకొరకె అవతరించి
వలపునిండిన గుండెతో నను వరించె.
నాశాంత తనుకాంతి ఆశాంతమై తోచు
నా కాంత కను కాంతి చంద్రకాంతిని త్రోచు
నా రాణి పాదాల పారాణి వెలుగులే
ప్రాగ్భాగమరుణిమై ప్రభలు చిందు
నా బాల ఫాల మర్ధచంద్రుని బోలు
ఆ నీలి కురులలో నెరితుమ్మెదలు వ్రాలు
నా కలికి గొంతులో కులుకు కోయిల కూన
ఆ కులుకు పలుకులో కురియు తేనెలవాన
నా రాగ సుందరీ నాట్యమాడెడివేళ
అచ్చంపు రాయంచలడుగులొత్తు
నా వాణి వేణిలో విరియు మల్లెల సౌరు
సొక్కి విహరించు నా యెడద యెక్కి వెన్నెల తేరు
నా లేమ వనసీమ నడయాడు సమయాన
పసిడి పచ్చని చేలు పాటపాడు
నా చాన చనువార చెయిసాచి పిలువంగ
సింహ, శార్దూలముల్ చెలిమి చేయు
నా సఖియ వెలయించు సౌహార్ద్రతను చూచి
సూర్యుడంతటి వాడు సుధలు కురియు
నా తరుణి గుణగణాల్ నా తరమె వర్ణింప
దాన సరితూగు చానలీ లోకాన లేరన్న
అతిశయోక్తులు కావులే అతివలార -
ఏ పూర్వ పుణ్యమో - ఏ పుణ్యఫలితమో
అతివ రూపాన నాకొరకె అవతరించి
వలపునిండిన గుండెతో నను వరించె.
3 కామెంట్లు:
అక్షరాల అల్లిక, పదాల పొందిక, ఆలి మీది అనురాగం కలసి విరిసిన మీ కవిత కడు కమనీయం.
అమోఘమయిన భావ వ్యక్తీకరణతో కూడిన చక్కని పదజాలం!
ధన్యవాదాలు జ్యోతిర్మయిగారూ, రసజ్ఞ గారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి