Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి

     [ మోహిని ]

     పూజిత సర్వ లోకుడల భూరిపరాక్రమ కృష్ణస్వామికిన్
     ఆ(జి సహాయసంపదలనందగజేసి కృతార్థయైన, సా
     త్రాజితి, యుక్తి సాహస పరాక్రమ శాలిని, సత్యభామినీ
     తేజము నిండగావలయు స్త్రీల మనమ్ముల దీప్తివంతమై !

     కలకల లాడు ముంగిళుల కాంతులు చిమ్మెడి దీపశ్రేణిలో
     తొలగెను చిమ్మచీకటి, విధూదయ బ్రాంతినిపెంచునట్టివౌ
     వెలదుల నవ్వులో గలసి వెవ్వెలబోయెను తారకామణుల్
     నిలచును గాక ఈ వెలుగు 'స్నేహ' యుతమ్ముగ నిత్యనూత్నమై !!

     వెన్నెలబోలు నవ్వులను పెద్దల మోమున కానలేమితో
     వన్నెల చిన్నెలన్ వెలుగు బాలల ప్రాభవ భవ్యలోక పుం
     గన్నుల తళ్కుతళ్కుమను కాంతికి చుక్కలు పోలగా, మరో
     మిన్నుగ కానవచ్చెగద మేదిని, దీపపు పర్వవేళలన్ !!!

     దీపావళి శుభాకాంక్షలతో.....

2 కామెంట్‌లు:

Dr.Suryanarayana Vulimiri చెప్పారు...

దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. మీకు మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.

మోహిని చెప్పారు...

ధన్యవాదాలు సూరి గారూ,మీకు,మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు