Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

18, జులై 2011, సోమవారం

నా తొలి పద్యం .. సమస్యాపూరణం

[ పింగళి శశిధర్ ]

చేరెడు కన్నులందు గురిచేసిన గాలము గ్రుచ్చి, గ్రుచ్చి,
య్యారము తోడ లేనడుము అల్లల నాడగ పాదమందు, శృం
గారము చిందు అందియలు ఘల్లున మ్రోగెడు కన్నె మోహనా
కారము కన్నులంబడగ కల్గదె మోదము మానవాళికిన్.

(ఆకాశవాణి విజయవాడ సమస్యాపూరణం కార్యక్రమంలో ది.23.08.1983 న చదవబడింది)

2 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చాలా బాగుంది మీ సమస్యా పూరణ . చిన్న నటి నుండీ పద్యాలు వ్రాయాలన్న కోరికే గానీ ఇప్పటికి వ్రాయ లేక పోతున్నందుకు , కొంచం నిరాశ కలుగు తున్నా , గురువుల ఆశీర్వాదంతో ప్రయత్నం కోన సాగిస్తున్నాను.అందరివి చదువు తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.

Jaabilliraave చెప్పారు...

ధన్యవాదాలండీ!. మీరు మాత్రం తక్కువ వారా మీ పద్యపూరణలు శంకరయ్యమాష్టారి బ్లాగ్ లో చూస్తున్నా చాలా బాగుంటున్నాయి. ఈ బ్లాగులో యింకా పద్యాలున్నాయి చూడండి.