(పింగళి మోహిని)
1. హృద్యంబై, కమనీయమై, మధురమై, యుత్సాహ సంయుక్తమై
సద్యోజాత చమత్కృతీ భరితమై, సంపూర్ణ ధారాళమై
ఉద్యద్దారణ ప్రౌఢిమాసగుణమై, ఓజోగుణోపేతమై
ఆద్యంతంబలరించె మోహనునిదౌ అష్టావధానమ్మిటన్ !
2. ప్రాచీనాధునికాంధ్ర కావ్యగత సారంబున్ మదింగ్రోలి, త
ద్రోచోరాజిత ‘ధార’ యాశు కవితా రూపాన తోడుండగా
వాచాంబోధి సరస్వతీ సుతుడుగా భాస్వంత సత్కీర్తియై
3. గురుకృప హేతువై నిలువ కూరిమి నేర్చిన పద్య విద్యతో
మరియొక ’విశ్వనాధ’ యన మాన్యత కగ్గగు యశుధార తో
వరుస శతావధానముల ప్రాభవమందిన మేడసాని లో
’తిరుపతి-వేంకటేశ్వరుల’ తేజము నిండెననంగ జెల్లదే !
4. ఆవనజాక్షి సత్కృపను ఆంధ్రులదౌ నవధాన విద్య లో
భావనె, అబ్భురంబనగ పంచ సహస్రము చేసినట్టి, పుం
భావ సరస్వతీ విపుల వైభవ మానిన భాగ్యసీమ, తా
పావనమయ్యె మోహనుని పద్యసభారసగాంగధారలోన్ !
5. కూరిమి పృచ్చకావళులు కోరిన వెంటనె పద్య మాలికల్
నేరుపు మీర పూరణలు స్నేహపురస్సర కావ్య భాష లో
ధారలు ధారలై కురిసె , ధన్య చరిత్రుడు , వానిదౌ అసా
ధారణ ధారణా ప్రతిభ దైవ కృపన్ విలసిల్లు గావుతన్.
6. అదియ పుంభావ శారద యాకృతనగ
మధుర మంజుల స్వర్ధ్హునీ మహిత కలిగి
సత్య లోకమ్ము నందుండి జాలువారి
మేదినీ స్థలి పుట్టె నీ ’మేడసాని’ !
(ఒకసారి శ్రీ మేడసాని వారి అవధానం చూసిన ఆనంద పారవశ్యంలో ఇలా...)
1. హృద్యంబై, కమనీయమై, మధురమై, యుత్సాహ సంయుక్తమై
సద్యోజాత చమత్కృతీ భరితమై, సంపూర్ణ ధారాళమై
ఉద్యద్దారణ ప్రౌఢిమాసగుణమై, ఓజోగుణోపేతమై
ఆద్యంతంబలరించె మోహనునిదౌ అష్టావధానమ్మిటన్ !
2. ప్రాచీనాధునికాంధ్ర కావ్యగత సారంబున్ మదింగ్రోలి, త
ద్రోచోరాజిత ‘ధార’ యాశు కవితా రూపాన తోడుండగా
వాచాంబోధి సరస్వతీ సుతుడుగా భాస్వంత సత్కీర్తియై
ఆచార్యోత్తమ పీఠిపై నిలచె తా నష్టావధానమ్ముచే !
మరియొక ’విశ్వనాధ’ యన మాన్యత కగ్గగు యశుధార తో
వరుస శతావధానముల ప్రాభవమందిన మేడసాని లో
’తిరుపతి-వేంకటేశ్వరుల’ తేజము నిండెననంగ జెల్లదే !
4. ఆవనజాక్షి సత్కృపను ఆంధ్రులదౌ నవధాన విద్య లో
భావనె, అబ్భురంబనగ పంచ సహస్రము చేసినట్టి, పుం
భావ సరస్వతీ విపుల వైభవ మానిన భాగ్యసీమ, తా
పావనమయ్యె మోహనుని పద్యసభారసగాంగధారలోన్ !
5. కూరిమి పృచ్చకావళులు కోరిన వెంటనె పద్య మాలికల్
నేరుపు మీర పూరణలు స్నేహపురస్సర కావ్య భాష లో
ధారలు ధారలై కురిసె , ధన్య చరిత్రుడు , వానిదౌ అసా
ధారణ ధారణా ప్రతిభ దైవ కృపన్ విలసిల్లు గావుతన్.
6. అదియ పుంభావ శారద యాకృతనగ
మధుర మంజుల స్వర్ధ్హునీ మహిత కలిగి
సత్య లోకమ్ము నందుండి జాలువారి
మేదినీ స్థలి పుట్టె నీ ’మేడసాని’ !
5 కామెంట్లు:
సంతోషం. ద్య ప్రాసతో మొదటి పద్యం చాలా బావుంది. ఉగాదికీ, దసరాలకీ పొద్దు పత్రికవారు జాలకవిసమ్మేళనం జరుపుతుంటారు. మీకు ఆసక్తి ఉంటే పొద్దులో తొంగి చూడండి.
అదియ పుంభావ శారద యాకృతనగ
మధుర మంజుల స్వర్ధ్హునీ మహిత కలిగి
సత్య లోకమ్ము నందుండి జాలువారి
మేదినీ స్థలి పుట్టె నీ ’మేడసాని’ !
very nice sasi garu
చాలా సంతోషం మిత్రులారా. దీని రచయిత్రి పింగళి మోహిని గారు. నేను నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే
పొద్దులో నావీ రెండు కవితలు వచ్చాయి. ఈ బ్లాగ్ లోనే వునాయి చూడండి
అద్భుతంగా ఉన్నాయి మీ పద్యాలు.
మాష్టారు గారికి ధన్యవాదములు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం. మీ శంకరాభరణం చూడటం జరిగింది మీ సమస్యాపూరణలు చాలా బాగుంటున్నాయి. మీ కృషి బహుథాః ప్రసంశనీయం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి