Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

31, మార్చి 2015, మంగళవారం

గడుగ్గాయిలు (చిన్నకథ)


[శశిధర్ పింగళి]
ఏమిటే అమ్మాయ్ అలా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావ్.. రా! యిలా వచ్చి కూర్చో..
ఏదీ ఈ పుస్తకం కాస్త చదివి పెట్టు.
పో అమ్మమ్మా! అది నాకు అర్థం కాదు.
అర్థం కాకపోవడమేమిటే, చదువుకున్న పిల్లవేగా 
కాస్త మనసుపెట్టి చదివితే అదే అర్థమవుతుంది.. ఏదీ చదువు
ఆ మనసు దగ్గరలేకనే ఇలా తిరుగుతున్నా
అఁ.. ఏమైందే నీ మనసుకి
ఏంటో.. అమ్మమ్మా! తుంటరిగా తెగ అల్లరి చేస్తుంటే కాస్త చూసి పెట్టమని ఒక అబ్బాయికిచ్చాను..
అఁ.. అయితే..

ఇప్పుడు ఇచ్చేయమంటే, అది తనకు బాగా నచ్చింది ఇవ్వనంటున్నాడు. పైగా కావాలంటే తన మనసు ఇస్తా తీసుకోమంటున్నడు గడుగ్గాయిలా.
అఁ..అంతమాటన్నాడా.. అయినా అలా ముక్కూమొహం తెలీనివాడికి మనసివ్వడమేమిటే చోద్యం కాకపోతేనూ..
ఏమో నాకేం తెలుసు.. చూడ్డానికి బాగానే వున్నాడు మంచివాడే ననుకున్నా..
అవున్లే యెంత మంచివాడుకాకపోతే.. బదులుగా తన మనసిస్తానంటాడు, నీలాగా తనూ ఎవరికో ఇచ్చానన కుండా.. సరేలే నువ్వుండు నేవెళ్ళి తీసుకువస్తా..
ఏమిటీ మనసా?!
కాదులేవే ఆ కుర్రాడిని..
మ్మ్మ్...
గడుగ్గాయిలు.. ఆమాత్రం తెలుసుకోలేనా నేను..కుర్రకుంకలు.
*** 

కామెంట్‌లు లేవు: