[శశిధర్ పింగళి]
చూరుకు వెలాడే దీపంలా
వాలిన కనురెప్పల కింద ఆ చూపులు
వంటరిగా వెలగలేక వెలుగుతున్నాయి
రెక్కలు విప్పిన రాబందుల్లా
ఆలొచనలు ఆకాశంలొ
గుండెలోని బాధని ముఖం దాక
మోసుకొచ్చిన ముద్దాయిల్లా కళ్ళు
తలొంచుకుని నేలచూపులు చూస్తున్నాయి
గుండెల్లొ ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని..
పెదవుల దగ్గర ఆపే ప్రయత్నంలో
ఆకాసానికి చిల్లులు పడ్డట్లు కురిసే
కళ్ళవెంబడి కన్నీటి వర్షం
హేమంతపు ఉషొదయంలో కొబ్బరాకుల వెనుకనుండీ
ఏటవాలుగా వచ్చే వెచ్చని అరున కిరణంలా ఓ
ఆపన్న హస్తం మెల్లగా భుజం పై పడి తనవైపు త్రిప్పుకుంటుంది
బాధతోనో, భారంతోనో
బరువెక్కిన ముఖాన్ని
మెల్లగా త్రిప్పి వాలుతున్న రెప్పలపైనుంచి ఆ కళ్ళలోకి
చూస్తే
ప్రసరించే ఆ ప్రేమ, వర్షించే ఆ కరుణ
మాటలు పలుకలేని ఓదార్పు
మెల్లగా భుజంపట్టి గుండెలకు హత్తుకునే ఆ సాంత్వన
ఒక్క క్షణం ఈ ప్రపంచమంతా లయమైపోయి
ఈ క్షణమొక్కటే శాశ్వతమైతే ఎంతబాగుంటుందొ
అన్న చిన్ని ఆశ
జీవునికి ముక్తైనా
మోక్షమైనా
ఆ ఒక్క క్షణమే మరి
సంశయాల..సంచితాలన్నీ
వదిలేసి ఆ గుండెలో
లయమైపోవాలనుంది.
1 కామెంట్:
ఒక్క క్షణం ఈ ప్రపంచమంతా లయమైపోయి
ఈ క్షణమొక్కటే శాశ్వతమైతే ఎంతబాగుంటుందొ
అన్న చిన్ని ఆశ
జీవునికి ముక్తైనా మోక్షమైనా
ఆ ఒక్క క్షణమే మరి.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి