( శశిధర్ పింగళి )
అనంత విశ్వంలో
పరివ్యాప్తంగా - నీవు
అనంతాకాశంలో
అణుమాత్రంగా - నేను
అంతచ్చక్షువు ల
నున్మీలనం చేసి
అంతరంగాన్ని దర్శిస్తే
ద్వైతం లో - అద్వైతం లా
పరిపూర్ణం గా - పరిపుష్టం గా
నాలో నిండిన - నీవు
నేనై నిండిన ఈ
విశ్వం!
త్వమేవాహం !
త్వమేవాహం !!
అహమేవ బ్రహ్మం !!!
అహం బ్రహ్మాస్మి.
అనంత విశ్వంలో
పరివ్యాప్తంగా - నీవు
అనంతాకాశంలో
అణుమాత్రంగా - నేను
అంతచ్చక్షువు ల
నున్మీలనం చేసి
అంతరంగాన్ని దర్శిస్తే
ద్వైతం లో - అద్వైతం లా
పరిపూర్ణం గా - పరిపుష్టం గా
నాలో నిండిన - నీవు
నేనై నిండిన ఈ
విశ్వం!
త్వమేవాహం !
త్వమేవాహం !!
అహమేవ బ్రహ్మం !!!
అహం బ్రహ్మాస్మి.
2 కామెంట్‌లు:
అహం బ్రహ్మాస్మి అనే దివ్య స్థితిలో ఉన్నప్పటికీ శిష్యునికి తన స్థితిని గూర్చి అతనికి చూచాయిగా తెలుస్తుంది తప్ప నిష్కర్షగా తెలియదు,
అప్పుడు సద్గురువే సహృదయుడై అతని ప్రస్తుత స్థితిని తాను చేరవలసిన స్థితిని ఎరుక పరుస్తాడు.
ఆ సందర్భంలోనే "అహం బ్రహ్మాస్మి" అనుభూతి కలిగిన శిష్యునికి "తత్వమసి" ఉపదేశం గావిస్తాడు.
చక్కగా ఉన్నది
(అవకాశం ఉంటె దూరదర్శన్ నేషనల్ చానల్ ద్వారా ప్రాసారమౌతున్న చిన్మయ మిషన్ వారి
" ఉపనిషద్ గంగ " అను ధారవాహికను ఆదివారం ఉదయం 10 గం||లకు వీక్షించగలరు.)
మీ తండ్రి గారిని అడిగినట్లు చెప్పగలరు
ధన్యోస్మి
?!
ఉభయకుశలోపరి!
ఎందుకో ! ఏమో! గానీ
తిక్కతలకెక్కినంతగా
తత్వం తలకెక్కదు - ఎక్కినా
ఎక్కువసేపు నిలవదు - నిలిస్తే
మనం మనంగా మనలేం !
మనలేకపోతే - మనంలేం !?
సర్వంసచ్చిదానందమయం
కామెంట్‌ను పోస్ట్ చేయండి