Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

12, సెప్టెంబర్ 2011, సోమవారం

కొంటె ప్రశ్న

పురాణాల్లో జనకుడు - జానకి, ద్రుపదుడు - ద్రౌపది ఇలా తండ్రుల పేరుమీదుగా వారి వారి కూతుళ్ళను పిలిచినప్పుడు. గౌతముని భార్య గౌతమి ఎలా అయ్యింది ?


అని ఈమధ్య మా అమ్మాయి అడిగితే ముక్కుమీద వేలేసుకోవడం తప్పలేదు. నాకూ అదే సందేహం మరి మీకు తెలుసా! చెప్పండి.

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

భార్య యశోధర కదా?
గౌతమి వాళ్ళమ్మాయి పేరేమో!

కంది శంకరయ్య చెప్పారు...

నిజంగా ఇది కొంటెతనంతో అడిగిన ప్రశ్నే!
గౌతముని భార్య గౌతమి అని ఎక్కడా చెప్పబడలేదు. సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘గౌతమి’ శబ్దానికి ‘ద్రోణుని భార్య, గోదావరి, బుద్ధుని బోధనం, గౌతముని న్యాయశాస్త్రం, పసుపు, దుర్గ,గోమతీనది, గోరోజనం‘ అనే అర్థాల నిచ్చింది.
గౌతమి శబ్దం ‘భాగీరథి, జాహ్నవి’ వంటిదే. గంగానది భగీరథుని లేదా జహ్నుని భార్య కాదు కదా!
గౌతముని భార్య అహల్య. గౌతమి కాదు.
గౌతముడు గోహత్యాపాతకాన్ని పోగొట్టుకొనడానికి శివుని మెప్పించి గంగానదిని తెప్పించి గోవు చచ్చిన చోట ప్రవహింపజేసాడు. అదే గోదావరీనది. గౌతముడు తెచ్చినందున అది ‘గౌతమి’ అయింది.

కంది శంకరయ్య చెప్పారు...

అసలు ఈ ప్రశ్నను బ్లాగులో కాకుండా మీ అక్కయ్యనో, నాన్నగారినో అడిగితే సరిపోయేది.

ఆత్రేయ చెప్పారు...

మూడు సమాధానాలు చూసారుగా, ఇంకా ముక్కున వేలు తీసేయండి.!!

పింగళి శశిధర్ చెప్పారు...

మిత్రులు అందరికి నమస్కారం. ఎంతో శ్రమకోర్చి సమాధానాలు వ్రాసినందుకు కృతజ్ఞతలు. అజ్ఞాతగారూ మీరుచెప్పింది గౌతమ బుద్దుని భార్య యశోధర. నేనడిగింది గౌతమ ఋషి గురించి. నేనూ నిఘంటువులు చూసాను మీరన్నట్లుగానే ఉంది. అయితే అసలు ఈ తర్కం మొదలయ్యింది.. ఓ సినిమా పాట " నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా" అన్నప్పుడు పదముసోకి గౌతమిఅయ్యింది అహల్య కదా అనుకుని అహల్యకు గౌతమి అనే పేరు ఎక్కడవుందా అనేది నా సందేహం.

కొత్త పాళీ చెప్పారు...

ఆ పాట అన్వయంలో అది రామాయణం ప్రస్తావన అనుకోవలసిన పని లేదు. ఆ తరవాతి వరుస చూస్తే - నీ ... వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా - అని ఉన్నది.
ఇక్కడ శిలగా ఉన్న ఒక మనిషి, ఇంకో మనిషి ప్రేరణతో కరిగి గోదావరిలాగా ప్రవహించింది - అనే భావం. రామాయణం - గౌతముడూ - అహల్య ప్రస్తావన కాదు. శీల స్త్రీగా మారలేదు.

శశిధర్ పింగళి చెప్పారు...

ఇక్కడ శిలగా ఉన్న ఒక మనిషి, ఇంకో మనిషి ప్రేరణతో కరిగి గోదావరిలాగా ప్రవహించింది - నిజమే
అక్కడ రాముడి ప్రేరణతో శిలయైన అహల్య స్త్రీ గామారటం స్పురింపచేస్తూ తాను ఆ సామ్యాన్ని తీసుకుని పాడిందనుకుంటున్నాను. అలా చేతనత్వాన్ని సంతరించుకున్నతాను తర్వాత "నీ ... వెల్లువలో గోదారి గంగనై పొంగుతు ఉన్నా " అంటుంది. వేటూరివారు తెలిసే దీన్ని వాచ్యార్థంలో ప్రయోగించారేమోనని నేననుకుంటున్నాను. కాకున్నను ఆశ్చర్యంలేదు. మీతో ఇలా e-పరిచయానికి ఆనందిస్తున్నాను.

Anil Piduri చెప్పారు...

ద్వితీయ స్టెప్పును
మీ కొంటె ప్రశ్నా శీర్షికతో- వేయిస్తే బావుంటుంది
పింగళి శశిధర్ గారూ!
ఎన్నుకున్న ఈ శీర్షిక బాగున్నది.
;
;

kadambari చెప్పారు...

ద్వితీయ స్టెప్పును
మీ కొంటె ప్రశ్నా శీర్షికతో- వేయిస్తే బావుంటుంది
పింగళి శశిధర్ గారూ!
ఎన్నుకున్న ఈ శీర్షిక బాగున్నది.