[శశిధర్ పింగళి]
యుగాల ముందునుంచీ కూడా
ఒక జీవనదీ ప్రవాహం
నిర్విరామంగా ప్రవహిస్తూనే వుంది
అలల క్రింది నుంచీ అంతర్వాహిని లా
మాయని ప్రేమేదో రహిస్తూనే వుంది
దిగంతాల సాక్షిగా
అమృతం ప్రవహించే – ఆ
నదీ ప్రవాహంలో-మునక
వేయని జీవి లేదంటే నమ్ముతారా?
పున్నమి రోజుల్లో చేసే
పవిత్ర స్నానం పరలోకంలో
ఫలితమిస్తుందేమో కానీ – ఈ
నదీ స్నానం మాత్రం -
సునాయాసం గా లభించే
అయాచిత పుణ్య ఫలం ..
అహర్నిశలూ - అవిశ్రాంతంగా
సృష్టిని తన ఓడిలోకి జేర్చుకొని
జీవాన్ని, జీవితాన్ని
ప్రసాదించే పావన గంగ - యెంత
కరుణామయ మూర్తి కాకపోతే
బ్రతుకు బ్రతుక్కీ - గడప గడపకీ
తనకు తానుగా
‘రేవు’ లా మారి - రేయింబవళ్ళూ
నీ మునివాకిట్లో కాసేపూ
నీ పెడవాకిట్లో కాసేపూ
నీ చుట్టూనే ప్రవహిస్తూ వుంటుంది..
రెక్కలుతొడిగిన చేపల్లా
నది నొదిలేసి యెగిరిపోయినా
నీ వెంటే నడిచొచ్చే - శీతల
సమీరమొకటి- నిన్ను కవచంలా కాపాడుతూ
ఆ ప్రేమని, అనురాగాన్నీ ఇంకా
ప్రవహిస్తూనే వుంటుంది...
అమ్మా!
అన్న ఒక్క పిలుపుతో
పొంగిపోయే - ఆ
రేవు పేరే అమ్మ!
పొంగులు వారుతూ ప్రవహించే
ఆ ప్రేమే! అమ్మ ప్రేమ !!
యుగాల ముందునుంచీ కూడా
ఒక జీవనదీ ప్రవాహం
నిర్విరామంగా ప్రవహిస్తూనే వుంది
అలల క్రింది నుంచీ అంతర్వాహిని లా
మాయని ప్రేమేదో రహిస్తూనే వుంది
దిగంతాల సాక్షిగా
అమృతం ప్రవహించే – ఆ
నదీ ప్రవాహంలో-మునక
వేయని జీవి లేదంటే నమ్ముతారా?
పున్నమి రోజుల్లో చేసే
పవిత్ర స్నానం పరలోకంలో
ఫలితమిస్తుందేమో కానీ – ఈ
నదీ స్నానం మాత్రం -
సునాయాసం గా లభించే
అయాచిత పుణ్య ఫలం ..
అహర్నిశలూ - అవిశ్రాంతంగా
సృష్టిని తన ఓడిలోకి జేర్చుకొని
జీవాన్ని, జీవితాన్ని
ప్రసాదించే పావన గంగ - యెంత
కరుణామయ మూర్తి కాకపోతే
బ్రతుకు బ్రతుక్కీ - గడప గడపకీ
తనకు తానుగా
‘రేవు’ లా మారి - రేయింబవళ్ళూ
నీ మునివాకిట్లో కాసేపూ
నీ పెడవాకిట్లో కాసేపూ
నీ చుట్టూనే ప్రవహిస్తూ వుంటుంది..
రెక్కలుతొడిగిన చేపల్లా
నది నొదిలేసి యెగిరిపోయినా
నీ వెంటే నడిచొచ్చే - శీతల
సమీరమొకటి- నిన్ను కవచంలా కాపాడుతూ
ఆ ప్రేమని, అనురాగాన్నీ ఇంకా
ప్రవహిస్తూనే వుంటుంది...
అమ్మా!
అన్న ఒక్క పిలుపుతో
పొంగిపోయే - ఆ
రేవు పేరే అమ్మ!
పొంగులు వారుతూ ప్రవహించే
ఆ ప్రేమే! అమ్మ ప్రేమ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి