------------------------------------------------------------------------------------------
(పింగళి శశిధర్)
కోటి రతనాల వీణ - తన
తెలంగాణ లో
మారు మ్రోగిన కంఠంబు
మూగ వోయె -
బూజు పట్టిన భావాల - రాజు
నైజాము పై
పదను పాళీల కలము తో
కదము నడపి -
తిమిర రక్కసి - కోరలు
పెఱికి వేయ - ఘోర
సమరము సేసిన సాహసీడు -
కుపిత మనస్కుల చూచి - క్రుధ్ధుడై -
తన రుద్ర వీణ పై
ఢమ ఢమ రున్నినాదాలు
చేసి - చేసి
అలసిపోయిన - ఆ
కవి చంద్రుడతడె
దాశరథి - తా
నాకస వేదిపైన
వెలుగుచున్నాడు
తెలుగు కైతలు - దిక్కుల
వెలువరింప !!
2 కామెంట్లు:
ఓ గొప్ప కవిగారి గూర్చి, మీ వంటి విద్యావేత్తల మాటల్లో చదవటం బాగుంది.
Thank you Fathimaji
కామెంట్‌ను పోస్ట్ చేయండి