Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

2, అక్టోబర్ 2008, గురువారం

విశాల హృదయాలు

[పింగళి శశిధర్]

ప్రపంచం చిన్నదై పోయింది
అయితే నేం
మా హృదయాలు మాత్రం విశాలం - ఎంతంటే
స్వధర్మాన్నే కాదని - పర ధర్మాని కి
పట్టం కట్టే టంత !
ప్రపంచీకరణ నేపధ్యం లో
దేశానికీ దేశానికీ మధ్య - అడ్డు
గోడలు కూలిపోయాయట
ఔను - నిజం !
ఆ ఇటుకల తోనేగా మాకూ మాకూ మధ్య
కొత్త గోడలు కట్టు కున్నాం
ఐతే నేం ?
మా హృదయాలు మాత్రం విశాలం !
దేశీయత మా స్వంతం - విదేశీయత మా పంతం
ఎంతంటే !
మా చదువుల్లో మాతృ భాష లేదు
మా హృదయాలకి మాతృ ఘోష తెలీదు
సంస్కృతీ కే సంస్కరణ లు - చేసే
సంస్కారం - మాది !
ప్రపంచం చిన్నదై పోయింది
అయితే నేం ?
మా హృదయాలు మాత్రం విశాలం !?

1 కామెంట్‌:

బొల్లోజు బాబా చెప్పారు...

బాగుంది.
సెటైరికల్ పోయెం లు వ్రాయటం కత్తి మీద సాము లాంటిది.
అంతే పదునుతో మీ కవితంతా నడిచింది. అభినందనలు.

ఒక విభేధన
మా చదువుల్లో మాతృ భాష లేదు అన్న భావానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిని. మెరుగైన ఉపాధులకై ఇంగ్లీషు విద్య అవసరమని నమ్ముతాను.

బొల్లోజు బాబా