[శశిధర్ పింగళి]
నిన్ను చూసిన ప్రతిసారీ
ఒక్కటే ఆశ..
నీ చిటికెన వ్రేలు నడ్డుపెట్టి
ఈ జీవితాన్ని దాటిస్తావని..
నువ్వేమో
నా ప్రారబ్ధపు ప్రాకారాలలో
మూటకట్టిన పడేసిన
సంచితాలమీద
నడచి పొమ్మంటావు..
అనాదికాలంగా ఎదుగుతున్న
ఆ రక్కెస పొదలు - నన్ను
అడుగుకూడా కదలనీయవని
నీకు తెలీదా!? ప్రభూ!