Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

మా గురించి

1. నాన్న గారు పింగళి వేంకట శ్రీనివాస రావు. రిటైర్దు ఉద్యోగి. పద్య రచన అభిమాన వ్యాసంగము. పలు సమస్యా పూరణలు రేడియో లోనూ, దూరదర్శన్ లోనూ ప్రసారితములు. జ్యోతిశ్శాస్త్ర పరమైన వ్యాసాలు భవిష్యవాణి మాసపత్రికలో వస్తున్నాయి. ఔత్సాహిక మిత్రమండలి తో యేర్పడిన చైతన్యభారతి సాంస్కృతిక సాహితీ పరిషత్ కు కార్యదర్శి గా వ్యవహరిస్తూ సేవలందిస్తున్నారు.



ఈమధ్యనే 2010 లో ఒక పద్యకావ్యాన్ని రచించి ఆవిష్కరించడం జరిగింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన 'సుభ' అనే ఆంగ్ల కథని కొద్ది మార్పులతో ఆధ్యాత్మిక పద్యకావ్యంగా తీర్చి దిద్దారు.

ఇంకా కొన్ని వెలుగు చూడవలసినవి వున్నాయి.



2. అక్క - పింగళి మోహిని, టీచరు గా విధులు నిర్వహిస్తున్నారు చిన్నతనం నుంచి వున్న సాహిత్యనేపథ్యం తో కవయిత్రి గా మారి డిగ్రీ చేసే సమయంలోనే పొతన గారి రుక్మిణీ కల్యాణాన్ని తనదైన శైలిలో వ్రాసుకున్నారు. ఇంకా సాహితీ సభలు, సమావేశాలు చూసి స్పందించడం పండుగలకీ పబ్బాలకీ పద్యాలతో శుభాకాంక్షలు పంపుకోవడం మినహా పుస్తక రూపంలో ఇంకా వెలుగు చూడలేదు.


3. ఇక పోతే, నేను శశిధర్, నిత్యం ఇంట్లో అమ్మ నోట పారాయణలాగా సాగే భారత,భాగవత, రామాయణాది పద్యాలు, ఇతర శతక పద్యాలు వినీవినీ తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకోగలిగాను. అయితే అక్క, నాన్నగార్ల వలే చిక్కటి పద్యాలు వ్రాయలేక కవితలవైపు మళ్ళటం జరిగింది. అప్పుడప్పుడు పద్యాలకోసం ఆరాటపడటమూ వుంది.

ఈ మా స్పందనలని ఇప్పుడు మీతో యిలా పంచుకోవాలనే వుద్దేశ్యంతో ఈ బ్లాగ్ ప్రారంభించాను. తలో కుంపటీ ఎందుకని, ఓ పేర్న ఫామిలీ రెస్టారెంటు ని ప్రారంభించి మీకు విందులు చేయాలని ఆశతో నిర్వహణా బాధ్యతల్ని బుజాన వేసుకున్నాను.

అశీర్వదించండి.

కామెంట్‌లు లేవు: