Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

30, జూన్ 2015, మంగళవారం

నేనూ బ్రహ్మనే !

[ శశిధర్ పింగళి ]
అనంతానంత విశ్వంలో
అణుమాత్రంగావున్న నేను కూడా
బ్రహ్మనే!?
ఎందుకంటే
పుట్టినదగ్గర నుంచీ
పరివారం కోసమైతేనేమి
ప్రపంచం కోసమైతేనేమి
ప్రతిక్షణం - నన్ను నేను
క్రొత్తగా సృష్టించుకుంటూనే వున్నా...మరి !?

 = = = 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఔనుస్మీ! నిజమేకదా! బాగుంది.

Ramesh B

konamanini kadambari చెప్పారు...

nice భావం -
మానవుడే మహత్ విరించి
- కుసుమాంబ[1955]&
konamanini.blogspot.in/