స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

26, జూన్ 2012, మంగళవారం

సీతమ్మ వాకిటా సిరిమల్లెచెట్టు (పాట)

( సేకరణ: శశిధర్ పింగళి )

సీతమ్మ వాకిటా సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ చిగురించి పూసె

చెట్టుకదలా కుండ| కొమ్మవంచండి
పట్టి పువ్వులు కోసి | బుట్టనింపండి
పెద్ద పువ్వులు యేరి | దండగుచ్చండి
దండ తీసుకువెళ్ళీ | సీతకీయండి

దాచుకో సీతమ్మ | రాముడంపేడు
దొడ్డిగుమ్మములోన | దొంగలున్నారు
దాచుకోకుంటేను | దోచుకుంటారు

(ఈ పాట  తన చిన్నతనంలో పిల్లలకి నేర్పించే వారని అమ్మ చెపితే వ్రాసుకుని యిలా మీతో పంచుకుంటున్నా.
ఆతరం పెద్దవాళ్ళకి తప్పక తెలిసి వుంటుంది. ఇప్పుడుకూడా ఓ సినిమాకి టైటిల్ గా వచ్చిందంటే విశేషమే కదా.)

5 వ్యాఖ్యలు:

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

ఇదే పాట మాకు రెండో తరగతిలోనో మూడో తరగతిలోనో తెలుగు పుస్తకంలో ఉండేది... 1989-90 ల మధ్యలో..

మధురవాణి చెప్పారు...

ఈ పాట మేము దసరా పండుగప్పుడు గౌరమ్మ (బతుకమ్మ లాగా ఇదొక రకం అనుకుంటా..) దగ్గర పాడుకునే పాటల్లో ఒకటి. :)

పింగళి శశిధర్ చెప్పారు...

మా చిన్నప్పుడు వుండేవి మరి 89-90 ల వరకూ కూడా వున్నాయంటే సంతోషించవలసిన విషయమే. దిలీప్ గారికి, మధురవాణిగారికి ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పటి ఒకటో తరగతి తెలుగు వాచకం లో ఉన్న పాట ఇది:
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు వంచకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
కోసిన పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకీయండి
రాముడంపాడమ్మ సిరిమల్లె దండ
ముడుచుకో సీతమ్మ ముచ్చటగ జడనిండ.
ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చదువుతున్న మా పిల్లలు ఒకటో తరగతి లో ఈ పాట నేర్చేసుకున్నారని చెప్పడానికి గర్విస్తున్నాను.
kiranmai

పింగళి శశిధర్ చెప్పారు...

ఇప్పటిసంగతి నాకు తెలీదుకానీ, ఒకటో తరగతిలో ఈ పాట వున్నందుకు అది మీ పిల్లలు నేర్చుకున్నందుకూ నేనూ సంతోషిస్తున్నాను కిరణ్మయిగారూ!
అయితే ఈ కొత్తపాటలో లయ లోపించిందనిపిస్తోంది. పాడితే మీకే తెలుస్తుంది. నే పోష్టు చేసింది పాత పాట పెద్దబాలశిక్ష వంటి వాటిలో ఈ ఒరిజినల్ దొరకవచ్చేమో.
ఇప్పుడొచ్చే సినిమాలో మీ కొత్తపాటే పెట్టినట్లున్నారు.