స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

30, మార్చి 2015, సోమవారం

సుదీర్ఘమైన వసంతాలు నా కక్కరలేదు...

[పింగళి శశిధర్]

విశ్వవ్యాపితమైన నీ
విరాడ్రూపాన్ని
దర్శించే శక్తి
ఈ చర్మ చక్షువులకు
లేవు...
దానికి ఆధార భూతమైన
నీ సుందర పద్మ సదృశమైన
పాదాలు చాలు..
సుదీర్ఘమైన వసంతాలు
నా కక్కరలేదు...
మధురమైన క్షణాలు కొన్ని చాలు...
వాటిని నెమరు వేసుకుంటూ
ఆనందంగా గడిపేస్తాను...
ఎందుకంటే
అనుభవాలకంటే
అనుభూతులకే
ఆయువెక్కువ .. 
ఆనందంఎక్కువ... మరి...
------------

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

అనుభవాలకంటే అనుభూతులకే ఆయువెక్కువ, ఆనందం ఎక్కువ మరి... బాగా చెప్పారు..