Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

19, జనవరి 2015, సోమవారం

నా కిప్పటికీ గుర్తే !

శశిధర్ పింగళి

నా కిప్పటికీ గుర్తే - ఆనాడు
తడబడుతూ .. తలొంచుకుని
మెట్టినింట పాదం మోపిన - క్షణం –
బిడియంతో - బెరుకు బెరుగ్గా
చూసిన – చూపులూ –
ఈ చిన్ని హృదయానికి – రాణిని
చేస్తానని ఇచ్చిన మాటా –
అన్నీ గుర్తే –
కానీ చిత్రంగా
కాలం కాలుకడిపి – ఓ పదేళ్ళు
ఇవతల పెట్టేసరికి – ఇలాతలం
పట్టనంత – ఆశ్చర్యం
వేళ్ళమధ్య నీళ్ళలా జారిపోయిన
కాలంతో పోటీపడిందో-ఏమో 
అప్పుడు పెట్టిన – ఆ లేత పాదం
పెరిగి పెరిగి పెద్దదై
త్రివిక్రముడి పాదంలా
కమండలంలో చేపలా
అరబ్బు గుడారం లో ఒంటెలా
పరిక్రమించి – ఆక్రమించేసింది... 
ప్రపంచీకరణ మంత్రాన్ని
పఠించిందో యేమో –
మనుషుల మధ్య నున్న – మార్మిక
సరిహద్దుల్ని చెరిపేసి
అగ్ర రాజ్యానికి – అధినేత లా
సంసార సామ్రాజ్యానికి
మహరాణి లా
బ్రతుకు బండికి ఇరుసులా
తానూ -
తన స్నేహపు చిరునామాలో
నా అస్తిత్వాన్ని వెతుక్కుం టూ
నేనూ -
ఇప్పటికీ – అమాయకంగా నవ్వే
ఆ నవ్వు వెనకాల
గెలుపు తెచ్చిన ధీమానో –
సాధించానన్న సంతృప్తో – ఒకటి
కొబ్బరాకుల వెనకనుంచీ
తొంగి చూసే సూర్య కిరణంలా
మెరుస్తూ వుంటుంది
సన్నజాజి పూల సుగంధంలా
పరిమళిస్తూ వుంటుంది. 

3 కామెంట్‌లు:

హను చెప్పారు...

చాలా బాగా విశ్లేషించారు........ బాగుంది

Jaabilliraave చెప్పారు...

Thank you!!!

http://akhilavanitha.blogspot.com/ చెప్పారు...

nice wiSlEshaNa Sasidhar Pngali gaaruu! -
konamanini.blog