Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

3, సెప్టెంబర్ 2011, శనివారం

శిధిల హంపి (కొంగర జగ్గయ్య)

శశిధర్ పింగళి ) 
( భ్లాగు ఉపశీర్షికలోని మాటలలో ఇంతవరకు మనసుకు తోచినవే వ్రాస్తూ వస్తున్నా. మనసు దోచిన వాటిల్లో భాగంగా, ఇప్పుడే 'శిరాకదంబం' రావుగారి బ్లాగులో శ్రీ జగ్గయ్య గారి గురించిన వ్యాసం చదివి ఈ టపా వ్రాస్తున్నా. ఇవి షుమారుగా 80ల ప్రాంతంలో ఒక వారపత్రికలో ఈయనగురించి వ్రాస్తూ ఈ పద్యాలు కూడా వేశారు.
అయనమీది అభిమానమో, పద్యమంటే వున్న అభిమానమో నన్ను ఇవి దాచుకునేలా చేసింది. ఈ పద్యాలు జగ్గయ్య తన 14వ యేట 1940లో వ్రాసారని చెప్పారు. ఆ వయసుకే భావంలోని గాంభీర్యం, భాషలోని ప్రౌఢత్వము అబ్బురమనిపించాయి. ఇప్పుడు మీతో యిలా పంచుకునేలా చేసాయి. చదవండి...........)

           ఇదొక విషాదగాధ; మునుపిచ్చట ఆయువుతీఱె, ఇందిరా
           వదన దరస్మిత స్పురిత వైభవ శస్తసమస్తగేహ, భృ
           న్మదన మహోదయమ్మునకు మాయని ఈ శిధిల ప్రశాంతిలో
           నిదుర మునింగిపోయెనొక నిన్నటి సత్యము శాశ్వతమ్ముగా !

           తెలుగు చరిత్రలో పసిడి తేటలుదిద్దిన కాలలేఖినీ
           విలసనధారలో పరువు విచ్చి జగమ్ములు మెచ్చి కొల్వగా
           పులకితమైన క్షేత్రమిది; మూగయెలుంగుల, ఓరుగాలులా
           తలపులు పాడుకొంచు బరితప్పవు నేటికదెంత బంధమో !

           ఇదికుందేటికి కూడ పౌరుషము రేకెత్తించు దేశంబు; దు
           ర్మద రాజన్య విదీర్ణ కంధరసిరా రక్తోష్ణ ఖడ్గప్రభా
           విదితోదగ్రుడు కృష్ణరాయుడిచటన్ స్వేచ్చా సముద్భూత; శుం
           భద ఖండాంధ్ర పతాక రేఖల దిశాభాండమ్ము వెల్గించెలే !

                                                                                                        ఇంకావుంది ....

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

జగ్గయ్యగారిమీద నాకమనీయం బ్లాగులో రాసిన వ్యాసం కూడా చదవండి.(ఆయన టాగూరు అనువాదా)ల గురించి).
కొడాలివారి హంపీక్షేత్రం కూడా ప్రసిద్ధ కావ్యం .చదవవలసినదే.

శశిధర్ పింగళి చెప్పారు...

చాలా సంతోషం. తప్పకుండా చూస్తాను.